27 August, 2026 | 6:36 PM

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు

27-08-2026 11:00 AM

కృష్ణాపురం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

మధిర: మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ భూక్య నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అడుగుజాడల్లో గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తు ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిపిఓ బాబు ఖాన్,  ఏఎంసీ డైరెక్టర్ వేల్పుల చెంచయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు పోచేపల్లి శంకర్రావు, బాణావతి హనుమంతు, పంచాయతీ సిబ్బంది నల్లబోతు నరేష్, నల్లబోతు నరసింహారావు, డీలర్  కర్నాటి లక్ష్మి, కర్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.