6 June, 2026 | 10:30 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

వార్‌లో మరో ఇద్దరు స్టార్లు!

11-10-2024 12:00 AM

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బడా ప్రాజెక్టు ‘వార్-2’లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నారు. అయితే, ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారనేదే తాజాగా అందుతున్న సమాచారం. సల్మాన్‌ఖాన్ సినిమా చివరలో స్పెషల్ ఎంట్రీ ఇస్తారని ముంబయి సినీవర్గాల టాక్. ‘మార్టిన్’ ఫేమ్ ధ్రువ సర్జా కూడా ఇందులో భాగం కావొచ్చని వినవస్తోంది.

దసరా అవ్వగానే ఎన్టీఆర్ సెట్‌లో అడుగు పెడతారట. అప్పుడు హృతిక్, తారక్‌పై కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలతోపాటు ఈ ఇద్దరు హీరోలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తారని భోగట్టా. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.