10 August, 2026 | 10:42 PM

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

10-08-2026 09:38 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను  పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, ఉప్పల్ సీసీఎస్ పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన షేక్ సాహుల్ (29) వృత్తిరీత్యా  డ్రైవర్ ఇతను పేరుమోసిన అంతర్రాష్ట్ర నేరస్థుడిగా పోలీసులు తెలిపారు. అతనిపై ఇప్పటికే 47 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు జవహర్ నగర్ కు చెందిన కుంచల గురు ప్రసాద్ (29) ఇతనిపై రెండు దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీన యంనంపేటలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరూ 90 

తులాల బంగారం, రూ. 20 వేల నగదును దొంగిలించి పరారయ్యారు.  సోమవారం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మోటార్ బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న షేక్ సాహుల్, గురు ప్రసాద్లను పోలీసులు ఆపి విచారించారు. దీంతో వారి దొంగతనాల వ్యవహారం బయటపడటంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, తులాల బంగారం, 150 గ్రాముల వెండి ఆభరణాలు, యూనికాన్ మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు, రూ. 3 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.