11 August, 2026 | 1:18 AM

ఫీజుల దోపిడీకి చెక్ పడేనా?

11-08-2026 12:20 AM
  1. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల వివరాలు బహిర్గతం చేయాల్సిందే..
  2. వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశాలు 
  3. మధ్యతరగతి ప్రజలకు ఊరట 

మేడ్చల్, ఆగస్టు 10(విజయ క్రాంతి): మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని చదివించ డం భారంగా తయారైంది. అటు ప్రభుత్వ పాఠశాలలో చదివించలేక, ఇటు ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజు భారీగా ఉండడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు పిల్లల చదువులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది.

ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నా యి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని, వెబ్ సైట్లలో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల మధ్య తరగతి ప్ర జలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే ఫీజులు తగ్గకపోయినా భవిష్యత్తులో ఇష్టానుసారంగా ఫీజులు పెరగబోవని అంటున్నారు. 

వ్యాపారంగా మారిన విద్య 

ప్రస్తుత పరిస్థితుల్లో విద్య ఒక వ్యాపార వస్తువుగా మారిం ది. విద్యార్థులకు విజ్ఞానం అందించడం ఏమో గాని ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా విద్యా వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ అనేక కా ర్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి.

బడ్జెట్ పాఠశాలలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. ఇరుకైన అద్దె ఇళ్లలో అనేక పాఠశాలలు నడుస్తున్నాయి. వసతులు ఉండవు కానీ ఫీజులు మాత్రం భారీగా ఉంటున్నాయి. కొన్ని పాఠశాలల్లో నర్సరీ పిల్లలకు రూ. లక్షల్లో ఫీజు ఉంది. చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లలో రూ. 50 వేల పైనే ఉంది. పాఠశాల విద్యకే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్య కోర్సులు చదివించినంత ఖర్చు చేయాల్సి వస్తోంది. 

అదనపు వసూలు 

ప్రైవేటు పాఠశాలల్లో అదనపు వసూలు అధికంగా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. పుస్తకాలు, యూనిఫాం స్కూల్లో నే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జూన్లో అన్ని పాఠశాలలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ విద్యాశాఖ అధికారు లు చర్యలు తీసుకోలేదు. అంతేగాక బస్ ఛార్జ్ కూడా ఇష్టానుసారంగా నిర్ణయించారు. స్పోరట్స్, అబాకస్ వంటి ఇతర యాక్టివిటీస్ పేరిట పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. 

ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేనా? 

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలు అవుతాయా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫీజుల వివరాలు నోటీస్ బోర్డు, వ్బుసైట్లో పెట్టడం వరకు మాత్రమే పరిమితం కాకుండా విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. బహిరంగంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంలు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయించిన పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఫీజుల విషయంలో పట్టించుకుంటారా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు చిత్తశుద్ధితో పట్టించుకుంటే సత్ఫలితాలు వస్తాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం కూడా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని అంటున్నారు.