2 August, 2026 | 5:05 PM

అంకుసాపూర్ శ్రీ సిద్ధి వినాయక యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

02-08-2026 03:39 PM

తంగళ్ళపల్లి ఆగస్టు 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడిగా మామిడి శెట్టి దినేష్, ఉపాధ్యక్షుడిగా రేగుల రాజు, కోశాధికారిగా బోనుగాని ప్రవీణ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామ పెద్దలు, యువకులు మరియు సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు, యువత సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం ఈ  కార్యక్రమంలో యూత్ సభ్యులు సురేందర్,భానుచందర్, సాయి రెడ్డి, వెంకటేష్ రాజు, తుమ్మల రాజు అజయ్ ఐలేష్, వంశీ, సంజీవ్ సభ్యులు పాల్గొన్నారు .