3 August, 2026 | 11:52 AM

ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా

03-08-2026 11:20 AM

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరా పార్క్(Indira Park) చౌరస్తాలో నిరుద్యోగులు(Unemployed) మెరుపు ధర్నా చేపట్టారు. 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల(Notification released) చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36,ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే దరఖాస్తు రుసుమును తక్షణమే తగ్గించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగుల ప్రభుత్వానికి హెచ్చరించారు.