4 April, 2026 | 2:47 AM

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

04-04-2026 12:00 AM

చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో ఘటన..

షాద్నగర్ ఏప్రిల్ 3 (విజయక్రాంతి):  రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండలం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో ఉదయం సుమారు 5: 20 నిముషాల సమయంలో రైలు పట్టాలు దాటడంతో రైలు రాకను గమనించకపోవడంతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందిందని మృతురాలు గ్రీన్ రంగు చీర గ్రీన్ జాకెట్ చేతికి రాయి ఉంగరాలు ఉన్నట్టు తెలిపారు. షాద్ నగర్ స్టేషన్ మాస్టర్ అభిషేక్ కుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే కానిస్టేబుల్ డి.మల్లేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని  షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.