16 March, 2026 | 9:06 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతాం: బండిసంజయ్

11-07-2024 02:17 PM

తిరుమల: పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు, వికసిత భారత్ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేవదేవుడు మరింత శక్తిని అందించాలని ప్రార్థించడం జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. స్వామివారిని అడ్డుబెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సేవకుల పాలన వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.