19 May, 2026 | 6:21 PM

Breaking News

హైడ్రా పేరుతో హైడ్రామా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

24-08-2024 05:28 PM

హైదరాబాద్: హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు?.. అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యుత్‌, నీటి సదుపాయం ఎలా కల్పించారు.? అని ప్రశ్నించారు. గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.