31-08-2025 07:11:09 PM
యూరియాను అందజేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్నల గోస తాకుతుందని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రేగొండ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైటాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియాను ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను అరిగోస పెడుతున్నాయని మండిపడ్డారు.
రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేయడం సిగ్గుచేటన్నారు. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎరువులు, యూరియాను అందజేయాలని లేనియెడల రైతులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని ధ్వజమెత్తారు.