31-08-2025 07:15:20 PM
చండూరు,(విజయక్రాంతి): పసునూరు గ్రామంలో ఉన్న పెద్ద చెరువు వాగు పైన బ్రిడ్జి నిర్మించాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని పసునూరు గ్రామంలో పెద్ద చెరువు వాగు పైన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పసునూరు గ్రామంలో ముత్యాలమ్మ గుడి నుండి పులి కుంట్ల సుంకుశాలకు అనుసంధానంగా ఉన్న రోడ్డు దారు రోడ్డు వేయాలని ఆయన అన్నారు.
పెద్ద చెరువు వాగు ఎక్కువ రావడంతో రైతుల పొలాలకు వెళ్లే దారిలో ఉన్న వాగు దాటడం కష్టంగా ఉందని,పంటలకు ఇబ్బంది జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రిడ్జినిర్మిస్తే వందలాది మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, తక్షణమే ఈ ప్రభుత్వం అంచనా వేసి కాంట్రాక్టర్ ని పిలిచి బ్రిడ్జిని నిర్మించాలని ఆయన అన్నారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందికరంగా ఉన్న యూరియాని అందుబాటులోకి తేవాలని రోజుల తరబడి పడికాపులు కాస్తు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారు అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 1న జరిగే తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకి రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.