శ్రీలంక తీరంలో.. అమెరికా జలాంతర్గామి దాడి ఇరాన్ యుద్ధనౌక మునక
87 మంది నావికులు మృతి
విశాఖపట్నం నుంచి స్వదేశానికి వెళ్తుండగా ఘటన
కొలంబో, మార్చి 4 : ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ- పేరుతో ఐదురోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో బుధవా రం ఇరాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కు చెందిన ‘ఐరిస్ డెనా’ అనే యుద్ధనౌక (ఫ్రిగేట్) గత నెల 17న విశాఖపట్నంలో నిర్వహి ంచిన అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళ్తుండగా శ్రీలంక గాలే నగర తీరానికి సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడి లో మునిగిపోయింది.
ప్రమాద సమయం లో నౌకలో 180 మందికి పైగా సిబ్బంది ఉండగా వారిలో ౮౭ మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో శ్రీలంక నావికాదళం వేగంగా స్పం దించి సుమారు 32 మంది సిబ్బందిని ప్రాణాలతో రక్షించింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ఇరాన్ నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందాయని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన నావికాదళం రెండు నౌకలు, ఒక విమానాన్ని ఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టింది.
రక్షించిన వారిలో గాయపడిన వారిని గాలేలోని నేషనల్ ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ నావికాదళ నౌక అంతర్జాతీయ జలాల్లోకి దిగిందని శ్రీలంక అధికారులు ధ్రువీకరించిన కొన్ని గంటల తర్వాత, ‘అమెరికా జలాంతర్గామి శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచింది’ అని విజిత హేరత్ చెప్పారు. కాగా ఈ దాడిలో కొందరు గల్లంతయ్యారని, వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి ప్రకటించారు.
శ్రీలంక తీరంలో.. హిందూ మహాసముద్రంలో తమ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టార్నిడో అమెరికా యుద్ధ నౌకలు ముంచివేసిందని అమెరికా రక్షణమంత్రి పీటే హేంగ్‌స్గెత్ ధృవీకరించారు. శ్రీలంక తీరం నుంచి ౪౦ నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అమెరికా జలాంతర్గామి తమ యుద్ధనౌకను సముద్రంలో ముంచివేయడంపై ఇరాన్ భగ్గుమంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై తమ దాడులను ఇకపై ఉధృతం చేస్తామని ప్రకటించింది.
ఇరాన్ అణుప్రాజెక్టు ధ్వంసం..
ఇరాన్‌లోని రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఎఫ్) ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదేహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ అణు ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఇక్కడ శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందని, దీనితో దాడి జరిపినట్లు ఐడీఎఫ్ తెలిపింది. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడకు మళ్లించిందని వెల్లడించారు.
గత ఏడాది జూన్ నెలలో ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ రోజు దాడికి ఉపయోగించిన మందుగుండు సామగ్రి కంటే ఈ నాలుగు రోజుల్లో ఉపయోగించిందే ఎక్కువ అని తెలిపారు. గతంలోనే ఇరాన్ అణుస్థావరాలపై తాము దాడులు చేశామని డెఫ్రిన్ తెలిపారు. అయినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపలేదని పేర్కొన్నారు. అణ్వాయుధాలను టెహ్రాన్ శివార్లలోని భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని, తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామని డెఫ్రిన్ వెల్లడించారు.




