గసగసాల ఉపయోగాలు!
14-05-2024 12:05 AM
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఎన్నో రకాల సమస్యలు తొలగిస్తాయి. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి వెయ్యదు.
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పీరియడ్స్‌లో వచ్చే నొప్పి, ఇబ్బందులు దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.






