8 July, 2026 | 9:07 AM

15న ఆధార్ హౌసింగ్ లిస్టింగ్

14-05-2024 12:41 AM

న్యూఢిల్లీ, మే 13: గతవారం ఐపీవో జారీచేసిన మరో ప్రధాన కంపెనీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ మే 15న లిస్టవుతుంది. రూ.3,000 కోట్ల సమీకరణకు జారీఅయిన ఈ ఐపీవో 26 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యిం ది. రూ.300 ప్రైస్‌బ్యాండ్ తో దీనిని జారీచేశారు. అలాగే డిజిట ల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ ఐపీవో  మే 15న ప్రారంభమై 17న ముగుస్తుంది. రూ.2,615 కోట్ల సమీ కరణకు వస్తున్న ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ. 1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీవో ధరల శ్రేణి ని రూ.258 నిర్ణయించారు.  దీనితో పాటు వెరిటాస్ అడ్వర్‌టై జింగ్, మన్‌దీప్ ఆటో ఇండస్ట్రీస్, ఇండియన్ ఎముల్సిఫైయర్, క్వెస్ట్ లాబొరెటరీస్,  రుల్కా ఎలక్ట్రికల్స్ ఐపీవోలు ఎస్‌ఎంఈ విభాగంలో జారీ అవుతున్నాయి.