ఘనంగా ఉత్తర నక్షత్ర వేడుకలు

12-09-2026 | 07:37pm

కోరుట్ల,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి(Ayyappa Swamy) జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం(Ayyappa Swamy Temple)లో ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు, మహిళలు , చిన్నారులు పాల్గొనగా ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.

 శివునికి ఇష్టమైన గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శివ పుత్రుడైన అయ్యప్ప కృపతో ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, 3 కోట్ల వ్యయంతో త్వరలో నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయానికి భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. గోశాల గరడ స్థంభం నిమిత్తం సుందరగిరి సత్యనారాయణ -రజిత దంపతులు రూ. 10 వేలు విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు గట్ల ఆనంద్, తులసి కృష్ణ, సహాయ కార్యదర్శులు శ్రీరాముల శ్రీనివాస్,  ప్రచార, కార్యదర్శులు చలిగంటి వినోద్, వందలాదిమంది భక్తులు, మహిళలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మరిన్ని వార్తలు