జిల్లా బీఎస్పీ అధ్యక్షుడిగా వల్లమల్ల ప్రవీణ్ నియామకం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా వల్లమల్ల ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ నియామకపు పత్రాన్ని ప్రవీణ్ కు అందజేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా బహుజన ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ నియామక ప్రధాన ఉద్దేశ్యం ఉన్నారు.
మేడ్చల్ జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే బాధ్యతను ప్రవీణ్ కి అప్పగిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తాను. బహుజన వాదాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో మేడ్చల్ జిల్లాలో బీఎస్పీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.




