15 March, 2026 | 4:22 AM

యదేచ్చగా పాత పాల్వంచ మొర్రేడు వాగు నుంచి ఇసుక రవాణా

14-03-2026 07:14 PM

అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఇసుక

మమ్మల్ని ఎవరు పట్టుకుంటారన్న ధీమా?

పాల్వంచ,(విజయక్రాంతి): మమ్ముల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ధీమాతో కొందరు ఇసుకాసురులు యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచలోని మొర్రేడు వాగు నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా ఏదేచ్ఛగా సాగుతోంది. ఉదయం వేళల్లో వాగులోని ఇసుకను ఒడ్డున యార్డులో కుప్పలుగా ఏర్పాటు చేసుకొని నిలువ చేస్తుంటారు. రాత్రి 11 గంటల నుంచి  తెల్లవారుజాము 5 గంటల వరకు వరుసగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక సుమారు రూ 3 నుంచి 4 వేలకు విక్రయిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, ఎంపీడీవో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేక ఆరోపణలకు దారితీస్తుంది. అక్రమార్కులకు అధికార అండదండ ఉందనే ప్రచారం సైతం సాగుతోంది. ఫలితంగానే ఇసుక సరుల అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగండి పోతాయనీ పాత పాల్వంచ, పాల్వంచ పట్టణ ప్రాంతంలో నీటి ఎద్దడి తాండవిస్తుందని  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.