25 August, 2026 | 5:15 PM

బీర్కూర్‌లో ఘనంగా వనమహోత్సవం

25-08-2026 04:39 PM

మొక్కలు నాటి సంరక్షించాలి

సర్పంచ్ ధర్మ తేజ, ఎంపీడీవో శ్రీనిధి

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మ తేజ, ఎంపీడీవో శ్రీనిధి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే వనమహోత్సవం ప్రధాన ఉద్దేశమన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని నిరంతరం సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

చెట్లు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని తెలిపారు. వర్షపాతం, భూగర్భ జలాల సంరక్షణలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోహన్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, వైస్ చైర్మన్ రాములు, ఎంపీవో మెహబూబ్, ఉపసర్పంచ్ పరమేష్, బసవరాజు పటేల్, ఆత్మ కమిటీ సభ్యుడు శంకర్, వార్డు సభ్యులు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.