50 రోజులుగా జైల్లోనే బండి భగీరథ్.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
06-07-2026 04:54 PM
హైదరాబాద్: పోక్సో కేసు నిందితుడు, బండి భగీరథ్ బెయిల్ పిటిషన్(Bandi Bhagirath bail petition)పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) వాదనలు ముగిశాయి. భగీరథ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. బండి భగీరథ్ కు బెయిల్ ఇవ్వొద్దని పీపీ పల్లె నాగేశ్వరరావు పట్టుబట్టారు. బెయిల్ ఇస్తే బాధితురాలిని బెదిరించే ప్రమాదం ఉందని పీపీ ఆరోపించారు. దర్యాప్తు దృష్ట్యా బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి లాయర్ ధర్మాసనాన్ని కోరారు. అటు 50 రోజులుగా భగీరథ్ జైలులో ఉన్నారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టుకు సూచించారు. బెయిల్ ఇవ్వాలని.. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు. బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పు వాయిదా వేసింది.






