దివ్యాంగుల వివరాలు పంపండి
భైంసా,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని యాజమాన్య విద్యాసంస్థలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతూ మార్చ్ 2027 లో జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న దివ్యాంగుల వివరాలను ఈనెల 15 లోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపించవలెనని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ప్రొఫార్మా ఒకటిని పూర్తిచేసి దివ్యాంగుల ఒరిజినల్ మెడికల్ సర్టిఫికెట్ తో పాటు ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీని సంబంధిత ప్రధానోపాధ్యాయులు పంపించవలనని సూచించారు. మార్చ్ 2027 లో జరిగే పదో తరగతి పరీక్షలలో దివ్యాంగులకు కొన్ని పేపర్ల మినహాయింపు, ఇతర రాయితీ సౌకర్యాలు సమకూర్చడం జరుగునని తెలిపారు. మిగతా విషయాలకు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ ను సంప్రదించాలని సూచించారు.






