6 July, 2026 | 6:34 PM

బిఆర్ఎస్ ను బద్నాం చేయడమే సీఎం రేవంత్ పని

06-07-2026 05:25 PM

హమాలీల ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చేరిగిన  కేటీఆర్ 

- కార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ కట్టుబాటు 

ఉప్పల్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీని  బద్నాం  చేయడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని ప్రతిరోజు ఢిల్లీ పెద్దలకు ఏం సంచులు మోస్తున్నాడు  నాకంటే మీకే బాగా తెలుసుఅని  బి ఆర్ ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు  తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల హమాలీ వర్కర్స్ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ సభ మల్లాపూర్‌లో విఎన్ఆర్ గార్డెన్స్ లోని  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని  ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే  గత పాలకుల వల్లే తెలంగాణ అప్పులు కుప్పగా మారిపోయిందని పాలన చేతగాక తమపై అసత్య ఆరోపణ చేస్తున్నారని  నిప్పులు చెరిగారు    హమాలీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ హయాంలో హమాలీ కూలీ రేట్లను భారీగా పెంచడంతో పాటు ప్రతి రెండేళ్లకోసారి సవరించి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హమాలీల ఆరోగ్య భద్రత, సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం సాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను వినియోగించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులు కష్టపడుతుంటే ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ

కేసీఆర్ హయాంలో మంజూరైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం త్వరలో పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హమాలీ కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ సీటు వస్తే వారి ఐదేళ్ల విద్యా ఫీజును తానే భరిస్తానని ప్రకటించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కొనియాడుతూ, ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు.మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాతే హమాలీ కార్మికుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. కార్మికులు, రైతుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం సాగిస్తాం : సంఘం నాయకుడు శీనన్న 

కార్మికుల హక్కుల కోసం స్థాపించిన యూనియన్ గత 18 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో హమాలీ కూలీ రేట్లు పలుమార్లు పెరగడంతో కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు.  టిఆర్ఎస్ పాలనలో హమాలీలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్రించిందని   భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, హమాలీ కార్మికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.