calender_icon.png 6 November, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుగుణ పౌల్ట్రీఫాం ఎదుట గ్రామస్తుల ధర్నా

06-11-2025 12:14:46 AM

శివంపేట, నవంబర్ 5 :శివంపేట మండల కేంద్రంలోని పోతుల బోగోడ గ్రామంలో సుగుణ పౌల్ట్రీ ఫామ్ నుండి వెలువడే తీవ్ర దుర్వాసన భరించలేకుండా ఉన్నామని గ్రామస్తులు పౌల్ట్రీ ఫాం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. సుగుణ ఫామ్ను తరలించాలని డిమాండ్ చేశారు.

గ్రామానికి సమీపంలో ఉన్న ఈ యూనిట్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఫామ్ వల్ల రోజంతా కుళ్ళిన మాంసం, వ్యర్థాల వాసన వ్యాపిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా ఫీడ్ ఫ్యాక్టరీ వల్ల నేల, నీటి వనరులు కలుషితమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫామ్ను గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలోకి తరలించాలని, లేకుంటే దాన్ని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు.