టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆర్ సీబీ రాయల్ గలా డిన్నర్ ప్రోగ్రామ్ లో రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి విరాట్ వెల్లడించారు. క్రికెట్ కెరీర్ నుంచి వైదొలిగిన కొంతకాలం ఎవరికీ కనిపించనని తెలిపాడు. ఇప్పటికైతే తనకు కెరీర్ పరంగా ఎలాంటి రిగ్రెట్స్ లేదని కోహ్లీ చెప్పాడు. ప్రతి ఒక్క ఆటగాడి కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు. అందుకే ఆడినన్ని రోజులు మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన కోహ్లీ భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. మూడు ఫార్మాట్లలో విరాట్ తనదైన శైలిలో మార్క్ వేశాడు. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫిట్ నెస్ సమస్యతో జట్టుకు దూరం అయిన దాఖలాలు లేవనే చెప్పాలి. వన్డేల్లో కూడా కోహ్లీ అత్యధిక సెంచరీలు బాదిన రికార్డులున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2024 లో కూడా విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన ఆయన 155.16 స్ట్రైక్ రేట్,66.10 సగటుతో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.