6 July, 2026 | 1:25 AM

నక్కలపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు సహాయక కేంద్రం ప్రారంభం

06-07-2026 12:37 AM

మొయినాబాద్, జూలై 5(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు, తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ కేంద్రం ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

కొత్త ఓటరు నమోదు, పేరు, చిరునామా మార్పులు, ఎన్యూమరేషన్ ఫారమ్లు నింపడంలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్వోలకు, ఓటర్లకు మధ్య వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కాపాడుకునేందుకు గ్రామ ప్రజలందరూ ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరి రవి, బూత్ ఏజెంట్ సమీర్, పార్టీ నాయకులు నవీన్, శ్రీకాంత్, భాను మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.