చేనేత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు విడుదల చేశాం
- ప్రతి కార్మికుడు 75 వేల నుంచి 1.50 లక్షల వరకు రుణం పొందవచ్చు
- భూదాన్ పోచంపల్లి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అందరికీ ఆదర్శం
- కోఆపరేటివ్ హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
యాదాద్రి భువనగిరి మే 2 (విజయకాంత్): కేవలం వెయ్యి మందితో ఖాతాలను. 6.50 లక్షలతో ప్రారంభించిన భూదాన్ పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నేడు 400 కోట్ల తో లక్ష మంది ఖాతాలతో విరాజిల్లడం ఐక్యతకు, అంకిత భావానికి నిదర్శనమని రాష్ట్ర మార్కెటింగ్ కోపరేటివ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం పోచంపల్లిలో తడాకా రమేష్ ఆధ్వర్యంలో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి లెక్టర్ ఎం హనుమంతరావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించ వచ్చు అని పోచంపల్లి వాస్తవ్యులు నిరూపించారు అని అన్నారు. కీర్తిశేషులు కొంగర భాస్కర్ ఆశయాన్ని నిలబెట్టారు అన్నారు. భూదాన్ ఉద్యమానికి పేరొందిన పోచంపల్లి ప్రాంతంలో ధాన్యం కూడా ఎక్కువగా పండుతుందన్నారు.
చేనేత రంగాలను ప్రోత్సహించేందుకు 290 కోట్లు పొదుపు పథకం ద్వారా విడుదల చేయడం జరిగిందని 75 వేల నుండి 1.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. చేనేత వస్త్రాలు డూప్లికేట్ రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా యూనిఫామ్స్ మెటీరియల్ను కొనుగోలు చేయిస్తామన్నారు. భూదాన్ పోచం పల్లి మున్సిపాలిటీగా ఏర్పడడం యునెస్కో వారిచే హెరిటేజ్ గ్రామం గా గుర్తింపు తెచ్చుకోవడం ఈ ప్రాంతం నేతన్న నెలవుగా మారిందన్నారు. ఉత్పత్తులు మార్కెటింగ్ చేపించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేపిస్తామన్నారు.
పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు రుణాలు అందించేటప్పుడు బంధువులుగా చూస్తూ సొంత సంస్థగా నడిపించినప్పుడే సహకార సంఘాలు బలపడతాయన్నారు.భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేనేత సంఘాలన్నీ కలిసి ఐక్యతతో నిలబడడం అభివృద్ధికి చిహ్నం అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట నెలకొల్పిన అవారడ్స్ కొనసాగిస్తామన్నారు.
ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరుస్తామన్నారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయర్ మాట్లాడుతూ... పొదుపు పథకాలన్నీ అమల్లోకి తెస్తామన్నారు ఆర్డీలు కట్టిస్తా నమన్నారు. ప్రతి చేనేత కార్మికుడికి 18 వేలు అనుబంధ కార్మికుడికి 6 వేలు జమ చేసే పద్ధతి వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుందన్నారు. చేనేత వస్త్రాలైన బెడ్షీట్లు టవల్స్ లుంగీలు మార్కెటింగ్ చేసేందుకు ప్రోత్సాహకరంగా షో రూమ్లను ఏర్పాటుచేసి విక్రయానికి చర్యలు తీసుకుంటామన్నారు అదే విధంగా టెక్స్టైల్స్ డిప్లమా కోర్సులో 60 మంది అభ్యసిస్తున్నారని తెలియజేశారు.
గతంలో 57 సంవత్సరంల వారికే బీమావర్తించేదని, ప్రస్తుత ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా వృద్ధులైన వారికి ఐదు లక్షల బీమా ను వర్తింప చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తడక వెంకటేశం, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మురళి మదన్ గోపాల్ స్వామి, భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖ బాబురావు, ఆర్డీవో శేఖర్ రెడ్డి,చేనేత కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.






