17 April, 2026 | 4:23 PM

10వ తరగతి టాపర్లకు సన్మానం

03-05-2025 02:02 AM

అర్మూర్, మే 02 (విజయ క్రాంతి) : ఆర్మూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజు సన్మానించారు.

మున్సిపల్ పరిధిలోని ప్రతి ప్రభుత్వ  పాఠశాలలో ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను మున్సిపాలిటీ తరపున సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తమ మార్కులు రావడానికి ప్రోత్సహించిన ఆయా పాఠశాలల ఉపాధ్యాయు లకు ప్రధానోపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

ఇదే విధమైన ప్రతిభను కనబరుస్తూ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఎంఈఓ రాజ గంగారాం, మున్సిపల్ అధికారులు, ఆయా పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.