calender_icon.png 21 February, 2026 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

21-02-2026 05:08:26 PM

మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలు నిరంతరం ఎదుర్కొంటున్న కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ కోతుల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకో నున్నట్లు వారు తెలిపారు.

ఇందుకుగాను ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులను నియమించాలని ఆలోచిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కోతులను పట్టి సుదూర అటవీ ప్రాంతానికి తరలించడానికి నిరంతరం చర్యలు కొనసాగుతాయని వారు వివరించారు. తమపై ప్రజలు పెట్టుకున్న బాధ్యతలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తామని, మంత్రి శ్రీధర్ బాబు, టి పి సి సి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుల సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రజలు తమపై చూపిన నమ్మకం, ఆదరణకు అనుకూలంగా తాము వ్యవహరిస్తామన్నారు.