చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం
కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, మే 27 (విజయక్రాంతి): రైతు లు ఎలాంటి ఆందోళన చెందవద్దని, చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాల నేపథ్యంలో ధా న్యం తడవకుండా రైతులు, కొనుగోలు కేం ద్రాల సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తం గా ఉండాలని సూచించారు. బుధవారం సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం లో ఉన్న ధాన్యం తడిచిందా లేదా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, జిల్లా యంత్రాంగం అన్నివేళలా రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే లారీ లతో పాటు అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా కూ డా రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించా రు. అకాల వర్షాల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ధాన్యంకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట సంగారెడ్డి తహసీల్దార్ జయరాం ఉన్నారు.






