18 June, 2026 | 12:46 AM

క్రీడాకారులకు సహకారమందిస్తాం: సీఎం

02-07-2024 12:05 AM

హైదరబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలు మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వీరిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువత, క్రీడాకారులు ఎదిగేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తోందన్నారు.