గర్భిణీలు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-సర్పంచ్ భూక్య తిరుపతి నాయక్
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ, సహాయక నూతన కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భూక్య తిరుపతి నాయక్ అధ్యక్షత వహించి కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఈ కమిటీ ఎంతో దోహదపడుతుందన్నారు.
కేంద్రంలో పౌష్టికాహార పంపిణీ, గర్భిణుల మరియు చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, అంగన్వాడీలో అమలు చేస్తున్న పథకాలపై నిరంతరం పర్యవేక్షణ అవసరమన్నారు. కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తూ గోవిందరావుపేట తండ గ్రామంలోని ప్రతి బిడ్డకు, ప్రతి గర్భిణికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు. కేంద్రాల నిర్వహణలో పారదర్శకతను పెంచడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, సూపర్వైజర్ గంగ లక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు చీటీ వెంకటరమణాదేవి, గ్రామ ఉప సర్పంచ్ లౌడియా శ్రీనివాస్, వార్డు సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.




