calender_icon.png 2 February, 2026 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడవాళ్లు ఎదురుతిరిగితే..?!

30-01-2026 12:00:00 AM

తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. జనవరి 30న రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత సృజన్ విలేకరులతో పంచుకున్నారు. “ఈ సినిమా చూసిన మరుక్షణమే ఇది తెలుగులో బాగా వర్క్ అవుట్ అవుతుం దనిపించింది.

వెంటనే రీమేక్ రైట్స్ తీసుకున్నా. అమ్మాయిలపై చేయి చేసుకోవడం చూస్తుం టాం. కానీ వాళ్లు రివర్స్ అయితే పరిస్థితి ఏమిటి అనే పాయింట్ నాకు చాలా నచ్చింది. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది చూడ లేదు. అయితే చూసినవాళ్లు కూడా ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి.. దాన్ని ఎలా చేయాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం.

కథపరంగా మార్పులుం డవు కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం. ఈషా రెబ్బా పాత్ర తన కెరీర్‌లో గుర్తిండిపోతుంది. తరుణ్‌ని డైరెక్షన్ కూడా అడిగాను. రీమేక్స్ చేయనని, నటుడిగానే కొనసాగుతానని చెప్పారు. -ప్రస్తుతం ‘గతం2’ పూర్తయింది. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’, ప్రియదర్శితో ఒక సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి.