9 May, 2026 | 11:33 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

సాగే ఈ పయనమే..

30-01-2026 12:00 AM

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతు న్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ముఖ్యపాత్రల్ని పోషించా రు. అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు.

తని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిం దీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పయనమే’ అనే పాటను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ బాణీ సమకూర్చటమే కాకుండా ఆయనే, సత్యప్రకాశ్‌తో కలిసి ఆలపించారు.

‘ఎన్నో ఎన్నెన్నో మలుపులు.. ఎన్నో ఎన్నెన్నో మార్పులు.. ఎన్నో ఎన్నెన్నో పిలుపులు.. ఎన్నో ఎన్నెన్నో తలపులు.. నవ్వులు ఓ చో ట.. రాలే పువ్వులు ఓ చోట.. జారే మనసే ఓ చోట.. గుండె తడిసే ఓ చోట.. ఎప్పుడు వస్తామో.. మళ్లీ ఎన్నడు చూస్తామో.. రెప్పల మాటున దాస్తామో.. గుర్తుల్లాగా మోస్తామో.. హే ఆ పయనమే.. సాగే ఈ పయనమే..’ అంటూ సాగుతోందీ పాట. ఈ చిత్రానికి జీ బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయిమాధవ్ బుర్రా డైలా గ్స్ రాశారు. ఎడిటర్: అయూబ్ ఖాన్; ఆర్ట్: మోహ న్ బీ కేరీ, శివ కామేశ్ డీ, సీహెచ్ కృష్ణ.