పర్యాటకంపై పట్టింపేదీ?

26-09-2026 | 05:55am

రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం 

కరీంనగర్, సెప్టెంబరు 25 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, జలపాతాలు అనేకం ఉన్నాయి కానీ పర్యటకంగా అభివృద్ధి చేసే దిశగా పాలకులు దృష్టి పెట్టడం లేదు. ఈ నెల 27న జరగనున్న పర్యాటక దినోత్సవం(World Tourism Day) పురస్కరించుకొని ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. 

ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, వసతులు కల్పిస్తే ఆదాయం మరింత సమకూరుతుంది.. కానీ పాలకులు ఆ దిశగా ఆలోచించడం లేదు.  ఒకప్పటి కరీంనగర్ రాజధాని ఎలగందుల నేడు పర్యాటకులు లేక వెలవెల పోతుంది.  ఈ కోట శాతవాహనులతోపాటు బాదామి చాళుక్యుల (550-7 50) నుంచి ఆసఫ్జాహీల(1724-1948) కా లం వరకు పాలన కేంద్రంగా విరాజిల్లింది.  ఎలగందుల చారిత్రక ప్రాంతం కావడంతో ప్రభుత్వం 2014లో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. అప్పుడు సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల తర్వాత అది నిలిచిపోయింది.

సామాగ్రి పాడైపోయింది. పర్యాటకంగా అభివృద్ధి చెందాలం టే గార్డెన్స్, పార్కులు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, వసతులు కల్పించాలి. కోట గురించి తరాల వారికి తెలిసే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు ఖిలంగూరు  ప్రతాపరుద్రుని అధికారుల లో ఒకరైన వొరగిరి మొగ్గరాజు దీనిని ని ర్మించాడు. ఇక్కడి దూద్ బావి బహుళ ప్రాచుర్యం పొందింది. మొలంగూరు గుట్టపైన, కింద కోనేరులు, దూద్ బావి, శివాల యం, వీరభద్రాలయం, కోట బురుజులు, రాతి ద్వారాలు, కందకాలు, ఫిరంగు లు సం దర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న దూద్ బావలోని నీరు పాలవలె తెల్లగా ఉంటాయి. ఈ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆ గ్రామస్థులు నమ్ముతారు వా టిని తీసుకెళతారు.

ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపడితే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అం టున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి శాతవాహనులు నిర్మించారని చారిత్రక అధారాలు చెబుతున్నాయి. వారు దీనిని రక్షణ కోటగా వినియోగించుకొని కోటి లింగాలను రాజధానిగా చేసుకొని పాలించారు. శత్రుదుర్భేద్యమైన ఈ కోట అరుదైన శిల్పకళ, బురుజులకు నిలయం. కోట పరిసర ప్రాంతాల్లో వనమూలికల సంపత్తి, అరుదైన వృక్షాలున్నాయి. రామగిరి ప్రాంతంలో వనమూలికలు, అరుదైన వృక్షాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వస్తారు.

ఈ కోటకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, కల్పించి అభివృద్ధి చేస్తే సుందరమైన ప్రదేశంగా విరాజిల్లుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు బొటానికల్ గార్డెన్ గా మారుతుంది. సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కరీంనగర్లో మానేరు డ్యాం ని ర్మాణం చేశారు. ఈ డ్యాంను ఆనుకొని ప్ర భుత్వం ఉజ్వల, జింకల పార్కులు, హరిత హోటల్ నిర్మించారు. డ్యాంపై నీడ వసతి, ఫుడ్ కోర్టులు పెరిగితే పర్యాటక తాకిడి పెరుగుతుంది. ఉజ్వల, జింక పార్కులను మరింత ఆకర్షించేలా తీర్చిదిద్దితే బాగుంటుంది.

హరిత హోటల్ను త్వరితగతిన వసతులు కల్పించాలి. ఇస్కాన్ టెంపుల్, టీటీడీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణంతోపాటు మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన ప్రాంతాలను తీర్చిదిద్దితే జిల్లాలో పర్యాటకులు పెరగుతారు. కొదురుపాక మధ్య మానేరులో వసతులు, సౌకర్యాలు పెంచితే బోటింగ్ కు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముంది.  రాష్ట్ర ప్రభుత్వం సైతం మరిన్ని నిధులు మంజూరు చేసి మైరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించాలి అలాగే రవాణా పరంగా రైల్వేలైన్ వేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు