తెలంగాణ ప్లేయర్లకు చోటేది?
- సన్‌రైజర్స్‌పై టీడీసీఏ అధ్యక్షుడు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శలు
- ఉప్పల్ స్టేడియం ముందు ధర్నా
హైదరాబాద్, మార్చి 24 : ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టీడీసీఏ అధ్యక్షుడు, స్టోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పేరుకే హైదరాబాద్ ఫ్రాంచైజీ అనీ, తెలంగాణ ప్లేయర్లకు చోటు ఎక్కడుందని ప్రశ్నించారు. పాక్ స్పిన్నర్‌ను కొనడానికి కోట్లు పెట్టిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లను ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్ రైజర్స్ యాజమాన్యం తీరును నిరసి స్తూ విద్యార్థి సంఘాలతో కలిసి ఉప్పల్ స్టేడియం ముందు ధర్నాకు దిగారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ హక్కులు సన్‌రైజర్స్ చేతు ల్లోకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇతర ఫ్రాంచైజీలు తెలుగు ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తుంటే సన్‌రైజర్స్ మాత్రం లోకల్ ప్లేయర్స్‌ను పట్టించుకోవడం లేదని మండిప డ్డారు.సహాయ సిబ్బంది, కిందిస్థాయి సిబ్బందిలో అందరూ తమిళవాళ్లే ఉన్నారన్నారు.
అలాంటప్పుడు సన్‌రైజర్స్ తమిళనాడుగా పేరు మార్చుకుని వారి రాష్ట్రంలోనే మ్యా చ్‌లు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక్కడ వనరులన్నీ వాడుకుంటూ స్థానిక క్రికెటర్లకు అవకాశాలు మాత్రం ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడామంత్రి వాకిటిశ్రీహరి, సన్‌రైజ ర్స్ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణ క్రికెటర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.




