కోల్‌కతా వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్
కోల్‌కతా, మార్చి 24: టీమిండియా టీ20 స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు ఐపీఎల్‌లో ప్రమోషన్ దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువక్రికెటర్‌ను ఆ ఫ్రాంచైజీ వైస్ కెప్టెన్‌గా నియమించింది. 19వ సీజన్‌లో అజింక రహానేకు రింకూ డిప్యూటీగా వ్యవహరించనున్నా డు.
దీనికి సంబంధించి కేకేఆర్ ఎండీ వెంకీ మైసూర్ అధికారిక ప్రకటన చేశారు. 2018లో కోల్‌కతా జట్టులోకి అరంగేట్రం చేసిన రింకూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. బెస్ట్ ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు.రింకూ ఇప్పటి వరకూ 59 మ్యాచ్‌లలో 1099 పరుగులు చేశాడు.
2023లో కోల్‌కతా జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాళ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. కాగా కొత్త బాధ్యతలతో రింకూ ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.




