2 May, 2026 | 4:27 AM

ఆ దేవి శరణమన్నా.. భూదేవి శరణమన్నా..

02-05-2026 03:14 AM

యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రవి పనస నిర్మాత. శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘శరణమన్న శరణం’ అనే పాటను రిలీజ్ చేశారు. ‘శరణమన్నా శరణం.. శరణమన్నా శరణం.. ఆ దేవి శరణమన్నా.. భూదేవి శరణమన్నా..’ అంటూ సాగుతున్న ఈ పాటను హాయ్ కేపీ స్వరపర్చగా, కుమార వాగ్దేవి పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: రాజ్ తోట; సంగీతం: హాయ్ కేపీ; సాహిత్యం: చంద్రబోస్, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్; ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్; ఎడిటర్: ప్రవీణ్ పూడి;