calender_icon.png 4 February, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూ పార్కులో తెల్లపులి మృతి

04-02-2026 12:35:10 AM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ జూ పార్క్ లో తెల్ల పులి (15) మృతి చెందింది. వృద్ధాప్య సమస్యలు, గుండె పోటు రావడంతో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారి మయూరి వెల్లడించారు. సాధారణంగా పులుల జీవితకాలం 14 ఏళ్లు కాగా, ఈ పులి అంతకంటే ఎక్కువ కాలం జీవించిందని పేర్కొన్నారు. రెండు నెలలుగా వైద్యులు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.