15 May, 2026 | 3:15 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

పెళ్లి.. హల్దీ వేడుక వద్దే ఆగుతోందేంటి?!

19-02-2025 12:00 AM

‘స్త్రీ2’ తర్వాత బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు మరో చిత్రం ‘భూల్ చూక్ మాఫ్’తో వస్తున్నాడు. ఇందులో రాజ్‌కుమార్ సరసన వామికా గబ్బి తొలిసారి తెరపై రొమాన్స్ చేయనుంది. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కరణ్ శర్మ రచనాదర్శకత్వం వహి స్తుండగా, మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ సినిమా ఫస్ట్ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో వామికా ప్రేమను పొందడానికే ప్రభుత్వోద్యోగం సంపాదించే లవర్‌గా కనిపించనున్నాడు రాజ్‌కుమార్. పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి తేదీ గురించి చర్చించుకోవడంతో టీజర్ మొదలైంది.

పెళ్లి నెలాఖరున.. అంటే 30న నిశ్చయించటం, హల్దీ వేడుకతో ఉల్లాసంతో ఉన్న రాజ్‌కుమార్.. మరుసటి రోజు కంగారు పడుతూ నిద్ర మేల్కొనే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 

ప్రతిసారీ 29వ తేదీన హల్దీ వేడుకతో పెళ్లి ఆగిపోతోందంటూ నిరుత్సాహానికి గురవుతాడు రాజ్‌కుమార్. మరి అతని పెళ్లి ఒక్కరోజు ముందు ఎందుకు ఆగిపోతోందో తెలియాలంటే తమ చిత్రాన్ని చూడాల్సిందే అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించేలా టీజర్ కట్ చేశారు.