17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పసుపు రంగులోనే ఎందుకు?

06-04-2025 12:00 AM

ప్రపంచంలోని దాదాపు అన్ని స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులోనే ఉంటాయి. అయితే విద్యార్థులు ప్రయాణించే ఆ వాహనాలు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయనే కారణాలతో పాటు దాని వెనక దాగి ఉన్న సైన్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రంగుకు ఒక తరంగధైర్ఘ్యం ఉంటుంది. తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటే ఆ రంగు మన కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎరుపు, నారింజ(ఆరెంజ్) ఆ తర్వాత పసుపు రంగుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఎరుపు రంగును డేంజర్‌కు సంకేతంగా ఉపయోగిస్తారు.

అలాగే పింక్ అండ్ ఆరెంజ్ రంగులు కూడా ఎరుపును పోలీ ఉంటాయి. అందుకే వీటిని స్కూల్ బస్సులకు ఉపయోగించరు. ఈ రంగుల తర్వాత.. అందరి కళ్లకు స్పష్టంగా కనిపించేలా ఉండే (తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉన్న) పసుపు రంగును స్కూల్ బస్సులకు వాడుతారు. పసుపు రంగులో ఉన్న స్కూల్ బస్సును దూరం నుంచి గుర్తించడానికి ఇతర వాహనదారులకు సులభం అవుతుంది. దీనివల్ల స్కూల్ వాహనాల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వర్షం, మంచు వంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా పసుపు రంగు క్లియర్‌గా కనిపిస్తుంది.