ఫోన్ విషయమై భర్త మందలింపు.. భార్య మిస్సింగ్
పిఎస్ లో ఫిర్యాదు చేసిన భర్త.
జవహర్ నగర్,(విజయక్రాంతి): భార్య ఫోన్లో విపరీతంగా మాట్లాడుతుండగా భర్త మందలించడంతో భార్య అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం ...జవహర్ నగర్ లోని కోమటి రాజయ్య, కవిత దంపతులు బాలాజీ నగర్ లో నివసిస్తున్నారు. కొంతకాలంగా కవిత(40) విపరీతంగా ఫోన్లో మాట్లాడుతుండగా భర్త రాజయ్య మందలించాడు. కినుకు వహించిన కవిత ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. సాయంత్రం రాజయ్య ఇంటికి రాగా కవిత కనపడలేదు. ఈ మేరకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కవిత గురించి భర్త రాజయ్య చుట్టుపక్కల వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






