తండ్రి మొబైల్ వాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
27-08-2026 | 03:02pm
హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన ఒక యువతి మొబైల్ ఫోన్ వాడకానికి బానిస కావడంపై తండ్రి మందలించడంతో గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం, ఉప్పుగూడ రైల్వే స్టేషన్(Uppuguda Railway station) సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కాచిగూడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉప్పుగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.