జానంపేటలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
- పొనుగోటి కామేశ్వరరావు బహిష్కరణ!
పినపాక,(విజయక్రాంతి): పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సిన మరియు పార్టీకి వెన్నుపోటు పొడిచిన పొనుగోటి కామేశ్వరరావుతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అడహక్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు జానంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఓటమికి నైతిక బాధ్యత / వెన్నుపోటు
ఇటీవల జరిగిన జానంపేట గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పొనుగోటి కామేశ్వరరావు ప్రధాన కారణమని పార్టీ గ్రామ కమిటీ నిర్ధారించింది. ప్రజలలో నమ్మకం కోల్పోయి, పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను గుర్తించారు.
సోషల్ మీడియా ప్రచారంపై క్లారిటీ
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినప్పటికీ, ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు గమనించామని, ఆయనకు ఆ అర్హత లేదని స్పష్టం చేశారు.
పార్టీ నుంచి బహిష్కరణ
జానంపేట బీఆర్ఎస్ పార్టీ అడహక్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు పొనుగోటి కామేశ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తీర్మాన ప్రతిని ఇప్పటికే మండల కమిటీకి కూడా పంపడం జరిగింది. నేటి నుంచి ఆయనకు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదు.
పొనుగోటి భద్రయ్య పాత్రపై స్పష్టత
పార్టీ సీనియర్ నాయకులు పొనుగోటి భద్రయ్య గారికి కూడా జానంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని అడహక్ కమిటీ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. అయితే, ఆయన సేవలను కేవలం మండల స్థాయిలో మాత్రమే వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. జానంపేట గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు అందరూ గమనించాలని కోరుతున్నాము.






