4 August, 2026 | 3:11 AM

ఎంత చెప్పినా మీరు మారరా..

04-08-2026 01:42 AM

అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం 

నిర్మల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న కొందరి అధికారుల తీరు మారడం లేదని  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకి జిల్లా అధికారులతో పాటు కొందరు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయవలసిన కొందరు అధికారులు పదేపదే నిర్లక్ష్యం చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు.

నిర్మల్ జిల్లాలో పేస్ రిక్వెస్టిగేషన్ సిస్టం లో చాలామంది ఉద్యోగులు ఎలాంటి అనుమతి గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. గత నాలుగు రోజుల రిపోర్టును శాఖల వారీగా సమీక్షించి పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కొందరు జిల్లా అధికారులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసులకే పరిమితమవుతు న్నారని తెలిపారు. మండల స్థాయిలో పనిచేసే అధికారులు కూడా కనీసం హాస్టల్ తనిఖీ చేయడం లేదని తెలిపారు.

అధికారులు పర్యవేక్షణ చేసినప్పుడే కదా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు అందుతాయి అని గుర్తు చేశారు. జిల్లాలో అన్ని శాఖల పనితీరుపై ప్రతిరోజు తాను స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నప్పుడు పరిమితమైన అధికారి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ అధికారులు ఉన్నారు.