25 May, 2026 | 2:39 AM

కార్మికులకు రూ.20 వేల కనీస వేతనం కాంగ్రెస్ ప్రభుత్వంపై హర్షాతిరేకాలు

25-05-2026 01:53 AM

నంగునూరు, మే 24: కార్మికులకు కనీస వేతనాన్ని రూ. 20 వేలుగా నిర్ణయించడంపై నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి,కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పార్టీ ఇంచార్జి పూజల హరికృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎంసి వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ..ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇమ్రాన్, చెర్రీ సురేందర్ రెడ్డి, సర్పంచ్ చేర్యాల వాణి కృష్ణ, ఏఎంసి డైరెక్టర్ ఐలయ్య, ప్రభాకర్,శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.