పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ
దమ్మపేట, మే 26(విజయక్రాంతి): పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు డిమాండ్ చేశారు. సోమవారం సి ఐ టి యు మండల కమిటీ సమావేశం విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ 2021 లో కనీస వేతనాలు సలహా మండలి పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించే జీవోలు విడుదల చేయాలని కోరారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, 1948 కనీస వేతనాలు చట్టం, సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా శాస్రీయంగా వేతనాలు లెక్కిస్తే ముప్పైరెండు వేలరూపాయలకు పెరగాల్సి ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నామ మాత్రంగా పెంచిందని అన్నారు. తాజగా కర్ణాటక ప్రభుత్వం కార్మికుల కు అరవై శాతం వేతనాలు పెంచిందని, పెరిగిన కర్ణాటక ప్రభుత్వం వేతనాలు ను పరిగణలోకి తీసుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆదినారాయణ, ఈశ్వరమ్మ, నాగు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






