26 May, 2026 | 4:35 PM

Breaking News

రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •  

గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో

26-05-2026 03:50 PM

బోథ్,మే 26(విజయక్రాంతి): గ్రామాలలో గుడిసెలలో నివాసం ఉండే వారి జాబితాలను గ్రామాల కార్యదర్శి సిద్ధం చేయాలని సోనాల ఎంపీడీవో మహేందర్(Sonala MPDO Mahender) పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాల కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇంటింటి కీ వెళ్లి వారి ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇండ్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

రానున్న రోజుల్లో ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నందున పేదలకు లబ్ధి చేరే విధంగా నమోదు చేయాలన్నారు. వాస్తవాలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక జరపాలని సూచించారు. ఇండ్లు ఉండి కూడా గుడిసెలలో నివసిస్తే వారు అర్హులు కాదని పేర్కొన్నారు. గ్రామంలో ఒక గుడిసె లేకుంటే 100% ఇండ్లు ఉన్నాయనే నివేదిక ఇవ్వాలన్నారు. అవకతవకలు జరిగితే కార్యదర్శులే బాధ్యులు అవుతారని గుర్తించారు. సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు