3 March, 2026 | 6:55 PM

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

03-03-2026 04:52 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలో బుధవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిర్పూర్ (టి) పెద్దబండ అటవీ ప్రాంతంలో  భీమన్నగుడి, అటవీ ప్రాంతంలోని అన్ని నీటి కుంటల వద్ద ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎఫ్.డి.వో అప్పయ్య పాల్గొని, భక్తులు గుడి పరిసరాల్లో అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థపదార్థాలు పారవేసి పరిసరాలు అపరిశుభ్రం చేయకుండా తిరిగి వెళ్ళేటప్పుడు తమవెంట తీసుకెళ్ళి, డంప్ యార్డ్,  చెత్త ట్రాక్టర్ లలో గానీ వేయవలసిందిగా కోరారు.

ప్లాస్టిక్,  ఇతర వ్యర్థపదార్థాలును అక్కడే వదిలివేయడం వల్ల, వాటిని ఆహారంగా తీసుకుని వన్యప్రాణులకు అపాయం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో వంట చేసుకునే వారు నిప్పుని అలాగే వదిలివేయడం వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాటిని పూర్తిగా ఆర్పి ఉందని వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్, డీఆర్వో శశిధర్ బాబు, సెక్షన్ ఆఫీసర్ అక్తర్, ఎఫ్బివోలు మల్లిఖార్జున్, అరవింద్, హబీబా, రవీనా, సంతోష్, అరుణ్ మరియు వాచర్లు పాల్గొన్నారు.