మున్సిపల్ లో ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ఒక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్ అన్నారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. రానున్న రంజాన్ వేడుకలకు వాటి బిల్లుల చెల్లింపు కోసమే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుందన్నారు.
గతంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికై 50 కోట్లు నిధులు కేటాయించాలని కోరగా 15 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే. ఈ పనులను అధికారులతో సమీక్షించి 42 వార్డులలో అక్కడి అవసరాలను బట్టి నిధులు కేటాయిస్తే, టెండర్లు సైతం పూర్తయితే మొన్నటి అత్యవసర సమావేశంలో ఈ టెండర్లు రద్దు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది.
ఈ విషయమై నిన్న కలెక్టర్ గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్మల్ పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు త్రాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 62.50 కోట్లు, మురికి నీటి శుద్ధి కోసం 42 కోట్లతో STP ప్లాంట్ల మంజూరుకు కృషి చేశారని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, కమ్మం సురేందర్, సాదాం అరవింద్, వొడిసెల అర్జున్, నరేష్, సాత్విక్, సూరజ్, విఠల్, శశాంక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




