calender_icon.png 3 February, 2026 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లూపస్ వ్యాధితో యువతి అకాల మరణం

28-07-2024 12:04:25 PM

కల్వచర్ల: పెద్దపల్లి జిల్లాలో లూపస్ వ్యాధితో ఓ యువతి అకాల మరణం చెందింది. రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన కట్ట సత్యనారాయణ కూతురు సాహితి లూపస్  అనే వ్యాధితో బాధపడుతుంది. దీంతో ఆమెకు హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాహితి మృతితో ఉరిలో విషాదచాయలు అలుముకున్నాయి. మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను  పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు.