భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన యువకుడు.!
13-09-2026 | 01:20am
తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో తన భార్య కాపురానికి రావడం లేదనే కుటుంబ కలహాలతో ఓ యువకుడు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. కూరాకుల తిరుపతిగా గుర్తించిన యువకుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి టవర్‌పైనే ఉండటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నాగర్ కర్నూల్ ఫైర్ సిబ్బంది, తాడూరు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి తిరుపతిని సురక్షితంగా కిందకు దించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.